Is PawanKalyan entry scene eye feast to fans in Vakeel Saab?
సాధారణంగా ఇండియన్ కమర్షియల్ చిత్రాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాగా సూపర్ స్టార్స్ సినిమాలు గురించి చెప్పనవసరంలేదు. అసలు ఫేవరెట్ హీరో ఇంట్రుడెక్షన్ సీన్ కోసం ఎదురుచూసే అభిమానులు చాల మంది ఉంటారు. అయితే హీరో ఇంట్రడక్షన్ సీన్ అనేది ఒక కమర్షియల్ వెయిట్ ఉన్న పాయింట్ కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా ఈ ఒక్క సీన్ కోసం కొంత ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. హీరో ఇంట్రడక్షన్ సీన్ కే చాల అమౌంట్ వెచ్చించిన సినిమాలు కూడా ఉన్నాయి. అది కమర్షియల్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కి ఉన్న వెయిట్. అయితే ఫాన్స్ ఒక ఇంట్రడక్షన్ సీన్ కోసం ధియేటర్ లో సందడి ఇంకా చెప్పాల్సిన పని లేదు.
కాగా చాల విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్… “వకీల్ సాబ్” సినిమాలో కూడా పవన్ ఎంట్రీ సీన్ కి స్క్రీన్ బద్దలవుతుంది అంటున్న డైరెక్టర్ వేణుశ్రీరాం. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ మొదటి సినిమాలో మహేష్ బాబుతో పవన్ ఒడ్డు పొడుగు చెప్పించి ఎంట్రీ సీన్ డిజైన్ చేస్తే, అత్తారింటికి దారేది లో పవర్ ఫుల్ ఫైట్ తో పంచ్ డైలాగ్ కూడా యాడ్ చేసాడు, కాగా అజ్ఞ్యాతవాసిలో ఒక నార్తర్న్ ఫైటర్స్ తో మార్షల్ ఆర్ట్స్ ఫామ్ ఫైట్ తో ధియేటర్ లో కేకలు పెట్టించాడు. అలాగే బాబీ కూడా గబ్బర్ సింగ్ 2 లో గుర్రం పై పవన్ ఎంట్రీ సీన్ ను డిజైన్ చేసాడు. అలాగే అంటే వెయిట్ అంటే పవర్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఎంట్రీ అదరగొడుతుంది అంట.