Vijay Thuppakki 2 sequel
తమిళ స్టార్ విజయ్ చేసిన తుపాకి సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. తుపాకి సినిమా ను ఏఆర్ మురుగదాస్ దర్శ్కత్వంలో ఇళయధలపతి విజయ్ చెయ్యడం జరిగింది. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలోనే కాకుండా తెలుగులోను మంచి వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమా సక్సెస్ చూసి దీనిని “హాలిడే” గా బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యడం జరిగింది.
అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. కాగా తమిళంలో, హిందీలోనూ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా “తుపాకి 2” రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సంతోష్ శివన్ తన ట్విటర్ ఖాతాలో తుపాకి పోస్టర్ ఒకటి పోస్ట్ చేశారు. అయితే మురుగదాస్ తరువాత తియ్యబోయే సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టడం వలన ఆ సినిమా “తుపాకి 2” అని వార్తలు వినిపిస్తున్నాయి.