Sunday, June 20, 2021

Latest Posts

ఇష్క్ సినిమాకు రెడ్ సినిమాలాగే ఇబ్బందులు

ishq movie release date 2021 telugu

తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఇష్క్ గత నెలలో థియేటర్ లో విడుదల కావాలి. కానీ, కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ కారణంగా, చిత్రం విడుదల తేదీ ని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇటీవల, ఓటిటీ  ప్లాట్‌ఫామ్‌లో ఇష్క్ విడుదల గురించి పుకార్లు వచ్చాయి. నిజానికి సన్ నెట్‌వర్క్, మెగా సూపర్‌గూడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఫాన్సీ ధరకి కొన్నది.

అయితే సన్ నెట్‌వర్క్ ఇప్పుడు థియేటర్ విడుదలకు ఒప్పుకోకపోవడంతో, ఇష్క్ మేకర్స్ ఎస్ఎస్ రాజు  ఇతర బ్యానర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకముందు కూడా, రామ్ యొక్క రెడ్ సినిమా కి కూడా ఇలానే ఇబ్బంది ఎదురయ్యింది. దర్శక నిర్మాతలు ఓటిటిలో రిలీజ్ చేద్దామంటే సన్ నెట్వర్క్ ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారో వేచి చూడాలి.

తాజా సమాచారం ప్రకారం, తేజా సజ్జా మరో పెద్ద ప్రాజెక్టుపై సంతకం చేసినట్లు తెలుస్తుంది, వాటి వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడి కాలేదు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss