Sunday, June 20, 2021

Latest Posts

ఇష్క్ ట్రైలర్ – అరెరే ఇది లవ్ స్టోరీ కాదే

Ishq Movie Trailer

యంగ్ హీరో తేజా సజ్జా డెబ్యూట్ చిత్రం జాంబి రెడ్డితో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు మరో సినిమాను విడుదల చేయడానికి రెడీ అయిపోయాడు ఈ యువ హీరో. అతని రెండోవ చిత్రం పేరు ఇష్క్. ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23 న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకి విడుదల చేశారు చిత్ర బృందం. ఇష్క్ ట్రైలర్ తేజ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ యొక్క అందమైన ప్రేమకథ తో మొదలయ్యింది. ఇక తేజా ప్రియా పుట్టినరోజును బీచ్‌లో ప్లాన్ చేస్తాడు తర్వాత కథ మొత్తం మారిపోతుంది. ఒక్క సారిగా థ్రిల్లర్ సినిమాల అనిపిస్తుంది. అంతే కాకుండా దానికి తగ్గట్టు సినిమా కి ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఈ చిత్రాన్ని ఎన్‌వి ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ నిర్మిస్తుండగా, ఆర్‌బి చౌదరి మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss