అసాధారణ రీతిలో ఇస్రో పీఎస్ఎల్వీ సీ49 రాకెట్‌ను దిగ్విజయంగా నిగిలోనికి ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టారు. ఏపీలోని శ్రీహరికోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఇస్రోకు చెందిన EOS-01తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రాకెట్‌తో ఈఓఎస్-1 శాటిలైట్‌తో పాటు మరో 9 కస్టమర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 పర్ఫార్మెన్స్ నార్మల్‌గా సాగింది. పీఎస్2 కూడా నార్మల్‌గా కొనసాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్నట్లే సపరేట్ అయ్యింది. పీఎస్ఎల్వీ బరువు 290 టన్నులు. అన్ని దశలు అనుకున్న రీతిలో పూర్తి అయ్యాయి. తొమ్మిది ఉపగ్రహాల్లో అమెరికా, లగ్జంబర్గ్, లుథివేనియా దేశాలకు చెందినవిగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: