Tuesday, May 18, 2021

Latest Posts

హైదరాబాద్ లో తెరుచుకొనున్న ఐ‌టి కంపెనీలు

కరోనా ప్రభావంతో దేశమంతటా లాక్ డౌన్ అమలు కాగా ఐ‌టి కంపెనీలకు కూడా వర్తించింది. కానీ ఇప్పుడు తెలంగాణాలో ఐ‌టి కంపెనీలు తెరుచుకోబోతున్నాయి. లాక్ డౌన్ మార్గదర్శకాలను సడలించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని ఐ‌టి కంపెనీలకు కూడా ఊరట కలిగించే అంశాన్ని తెలియచేసింది. 33 శాతం ఉద్యోగులు కంపెనీలలో హాజరు కావచ్చని తెలంగాణ CP సజ్జనర్ తెలియ చేశారు. అయితే వ్యక్తి గత దూరం పాటిస్తూ, లాక్ డౌన్ మార్గ దర్శకాలను పాటిస్తూ, కరోనా నియంత్రణ నియమాలను పాటించ వలసినదిగా తెలియచేసారు.

అయితే ఎటువంటి నిభందలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ “హైదరాబాద్ లోని లాక్ డౌన్ నియమాలు సడలించినందున ఐ‌టి కంపెనీలు 30 శాతం స్టాఫ్ ను ఆఫీసు కు పిలిపించుకోవచ్చని, అది కూడా మొత్తంగా ఒకే సారి కాకుండా కొంత మందిని కొన్ని రోజుల తర్వాత కొంత మందిని ఆఫీసు కి రమ్మనల్సిందిగా తెలియచేసారు. అదే విధంగా వచ్చిన ఉద్యోగులను ఉదయం 7:30 నుంచి 10:30 రమ్మని వెళ్ళేటప్పుడు 2:30 నుంచి 6 గంటల వరకు ఆఫీసు నుంచి బయటకు పంపించాలని, కఫే ఏరియా మాత్రం ఓపెన్ చెయ్యవద్దని ఆదేశించారు.”

ఇది కూడా చదవండి: అగ్రరాజ్యన్ని వణికిస్తున్న మరో మాయదారి రోగం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss