IT Minister KTR visited the containment Zones in Hyderabad
హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోన్న కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని రోజుల క్రితం కంటైన్మెంట్లను ఏర్పాటు చేశారు. గురువారం ఐటీ శాఖ మంత్రి కే.టీ.ఆర్ మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కలిసి జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్మెంట్ ప్రదేశాల్లో పర్యటించారు. కేటీఆర్ గారు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ తీసుకుంటున్న చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఖైరతాబాద్, విజయ్‌నగర్ కాలనీ, మల్లేపల్లిలో ప్రాంతాలలో గురువారం కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి పర్యటించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను ప్రజలకు ఎలా అందిస్తు అందిస్తున్నారో ఈ సందర్భంగా లోకేష్ కుమార్ కేటీఆర్‌కు వివరించారు. కరోన గురుంచి ఎవరు బయపడవలిసిన అవసరం లేదని బారోసా ఇచ్చారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారికి కావలసిన నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచామని కేటీఆర్ వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, లాక్‌డౌన్‌కు సహకరించాలని కేటీఆర్ అన్నారు.