Sunday, June 20, 2021

Latest Posts

హీరో ధనుష్ చిత్రం నేరుగా ఓటిటిలో ఎప్పుడంటే!

Jagame Thandhiram Release Date

తమిళ్ హీరో ధనుష్ చిత్రం జగమే తంత్రం చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్-ఎంటర్టైనర్ గత ఏడాది మేలో విడుదల కావాలి, కాని కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. అయితే అభిమానులు ఈ సినిమా విడుదల కోసం చూస్తుండగానే మరో చిత్రం కర్ణన్ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది.

దీనితో ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఈ మధ్యలో థియేటర్ రిలీజ్ చేద్దామని చూశారు. అయితే మరో సారి కరోనా విరుచుకుపడుతుండటంతో ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ ఉంటుందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ధృవీకరించారు. అయితే రిలీజ్ తేదీ విషయాన్ని ఓటిటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ చిత్రం జూన్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని మంగళవారం ప్రకటించింది.

“జగమే తంత్రం చిత్ర బృందం హృదయపూర్వకంగా ఎంతో కష్టపడి చేసిన చిత్రం 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ప్రీమియర్ కానుంది”అని ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. ఇక ఈ చిత్రంలో ధనుష్ ఒక సాధారణ వ్యక్తి నుండి డాన్ గా మారిన వ్యక్తి గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss