Monday, May 10, 2021

Latest Posts

వారికి కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏ.పీ ప్రభుత్వం

గ్యాస్‌ దుర్ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమని సీఎం జగన్‌ విచారం వ్యక్తం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం అ‍న్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రిక  సమావేశం లో ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించారు.

అలాగే ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఆస్ప్రతుల్లో 2, 3 రోజులు ఉండి చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. అలాగే ఆ దుర్ఘటన జరిగిన పరిసర ప్రాంతంలో నివశిస్తున్న దాదాపు 15000 మందికి ఒకొక్కరికి పది వేల చప్పున ఆర్ధిక సహాయం అంద చేయనున్న ట్లు తెలిపారు. వీటితో పాటు మూగజీవలకు కూడా రూ.20 వేలు చప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:భోపాల్ దుర్ఘటనను గుర్తు చేసిన విశాఖ ఘటన

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss