Home రాజకీయం రైతుల కోసం వై‌ఎస్‌ఆర్ జనతా బజార్

రైతుల కోసం వై‌ఎస్‌ఆర్ జనతా బజార్

ఈ రోజు రైతు భరోసా తొలి విడతగా ఇవాళ 2,800 కోట్ల రూపాయలు విడుదల చేసిన వై‌ఎస్ జగన్ రైతులకు మరింత లాభం చేకూరేలా గ్రామ సచివాలయాల పక్కనే “వై‌ఎస్‌ఆర్ జనతా బజార్”ను నెలకొల్పనున్నట్టు తెలియచేసారు.కాగా రైతుల అక్కౌంట్ కు డైరెక్ట్ గా నగదు పడగా, వరుసగా రెండో సంవత్సరం రైతులకు భరోసా అందచేశామని తెలియచేసారు. పార్టీలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రైతులకు సాయం చేస్తున్నాం అని, ప్రతి అన్న ధాతకు ఏడాదికి రూ.1300 వేల రూపాయలు సాయం అందచేస్తున్నట్టు తెలిపారు.

ఏ రైతుకన్నా ఇబ్బందులు ఉంటే 1902 నంబర్ కు కాల్ చెయ్యవలసిందిగా కోరారు. ఈ నెల 30 కి మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యిందని ఆరోజు 10,641 రైతు భరోసా కేంద్రాలు ఆవిష్కరిస్తామని తెలియచేసారు. రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయని, రైతు భరోసా నగదు బదిలీని సి‌ఎం జగన్ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: మద్యం నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్న జగన్

Exit mobile version