ఏపి లో మద్య నియంత్రణా చర్యగా సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైస్ శాఖకు చెందిన 70 శాతం ఉధ్యోగులను స్పెషల్ ఎన్ఫోర్మెంట్ బ్యూరోకు కేటాయిచింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మద్యం నియంత్రణతో పాటు, ఇసుక అక్రమ రవాణా వంటి వాటిపై నిఘా పెట్టి పనిచెయ్యల్సిందిగా వీధి విధానాలు రూపొందించడమైనది. కాగా ఇకపై ఎక్సైస్ శాఖలో కేవలం 30 శాతం మండి మాత్రమే విధులు నిర్వహిస్తారు.
ఎక్సైస్ మరియు ఎస్ఈబి మద్య క్యాడర్ పోస్టులు మొదలుకుని ఔట్ సోర్కింగ్ పోస్టుల వరకు ప్రస్తుతం ఎక్సైస్ శాఖలో విదులు నిర్వహిస్తున్న 4,721 మందిని 70:30 శాతం ప్రతిపాదికన విభజించారు. ఈ శాఖకున్న విదులన్నిటినీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు బదిలీ చెయ్యడం జరిగింది. కాగా మద్యం దుకాణాలు, డిజిటల్ బిల్ నిర్వహణ, లైసెన్స్ ఫీజ్ వసూలు, ఆదాయ సముపార్జన వంటి విధులకు మాత్రమే ఇకపై ఎక్సైజ్ శాఖ పరిమితం కానుంది.
ఇది కూడా చదవండి: రూ. 409.47 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఏపి ప్రభుత్వం