Sunday, January 24, 2021

Latest Posts

వైస్సార్‌పై విజయమ్మ రాసిన పుస్తక ఆవిష్కరణ రేపే

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి71వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ  రాసిన ”నాలో… నాతో… వైయస్సార్‌” పుస్తకాన్ని  ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్‌ వైయస్సార్‌ గారి సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం.
వైఎస్ గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్‌ వైయస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా, నిజ జీవితంలో వైయస్సార్‌గారు ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే, తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా డాక్టర్‌ వైయస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో విజయమ్మ వివరించారు.

డాక్టర్‌ వైయస్సార్‌ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్‌ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, వైయస్‌ జగన్‌, షర్మిలలతో వారి కుటుంబాలతో వైఎస్సార్ అనుబంధాలు, మహానేత మరణంతో ఏదురైన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss