Wednesday, April 21, 2021

Latest Posts

అంబానీతో జగన్ చెలిమి రహస్యం తేల్చాలంటున్న కాంగ్రెస్

Jagan meets Ambani:

రిలయన్స్ అధినేత అంబానీ – జగన్ ప్రభుత్వ లాంఛనాలతో కలవడం పట్ల పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సీరియస్ అయ్యారు. వారి ఇద్దరి కలయిక రహస్యం ఏంటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు వైఎస్ రచ్చబండ కోసం వెళ్తూ మృతి చెందినపుడు ,ఆ మరుక్షణం నుంచే జగన్ సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేసాడని ఆయన ధ్వజమెత్తారు.
వైఎస్ అంతిమ సంస్కారాల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఉంటే, కన్న కొడుకు మాత్రం పదవి కోసం పాకులాడాడని మస్తాన్ వలీ ఆరోపించారు. ఇక ‘‘వైఎస్ మృతిపై కాంగ్రెస్ అధిష్టానంపై ఆరోపణలు చేశారు. పదవి కోసం తండ్రి మరణాన్ని వాడుకున్న దుర్మార్గుడు జగన్. రిలయన్స్ అధినేతపై విస్తృతంగా ఆరోపణలు చేశారు. తన అనుకూల మీడియాతో విచ్చలవిడిగా ప్రచారం చేశారు. కరుణాకరరెడ్డి లాంటి ఎందరో నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఉసిగొల్పారు . రిలయన్స్ ఆస్తులను వైసీపీ నేతలు ధ్వంసం చేశారు’అని వలీ గుర్తుచేశారు.

అప్పుడు అంతలా వ్యవహరించిన జగన్ ఇప్పుడు మాత్రం తండ్రిని చంపిన అంబానీని సత్కరించడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని వలీ డిమాండ్ చేసారు. ఆ రోజు వైఎస్ మృతికి వెయ్యి కోట్లు చేతులు మారాయని సోనియా – అంబానీపై ఆరోపణలు చేసిన జగన్ ఈ రోజు ఎన్ని కోట్లు తీసుకొని అంబానీని కౌగిలించుకున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. వేల కోట్ల గ్యాస్ నిక్షేపాలు దోచుకుపోతున్నారని ఆనాడు ఆరోపించి అంబానీతో ఇప్పుడు చెలిమి చేయడంలోని ఆంతర్యం ఏమిటో తక్షణమే వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss