Monday, March 1, 2021

Latest Posts

ఏపీ లో కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రారంభించిన జగన్

Jagan Started COVID Vaccine Distribution

కృష్ణా జిల్లా సర్వజనాసుపత్రిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. మొదటగా హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్ వర్కర్లు నాగజ్యోతి, జయకుమార్‌, స్టాఫ్ నర్సు మరియమ్మ, డా.ప్రణీతలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఏపీ మొత్తం 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నట్టు సమాచారం.

విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు అందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు.

మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 5 లక్షల టీకాలను తీసుకువచ్చారు. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ సాయంతోనే ఈ టీకాను వేస్తారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss