Jaganmohan Reddy Government decision right? Does it happen ….?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపగా దానికి ఆయన ఆమోద ముద్ర వేశారు. దీనికి రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలపింది. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది తద్వారా ఇప్పుడు కొనసాగుతున్న కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు, జగన్ సర్కారు తెలివిగా ఉద్వాసన పలికింది అంటూ రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కలామ్ మూగయడం తో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ సెక్రటరీగా ఎస్.రాంసుందర్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది అని వార్తలు వినిపిస్తున్నయి. ఎస్.రాంసుందర్ రెడ్డిని ప్రస్తుతం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం రాత్రి ఎస్.రాంసుందర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభూత్వమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రస్తుతం విదులు నిర్వర్తిస్తున్నా స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని ఆదేశించింనట్లు వార్తలు వస్తునాయి.
కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆర్డినెన్స్ ద్వారా పదవి నుంచి తపించినట్లు ఎక్కడా ప్రస్తావన తీసుకు రాకుండానే ఈ వ్యవహారాన్ని పూర్తి చేస్తున్నారా. కానీ కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఆయనను తొలగింపు అంత సులభం కాదని అంటున్నారు. రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఒకసారి బాధ్యతలు చేపట్టాక పూర్తి కాలం పదవిలో ఉంటారని, మధ్యలో తొలగించాలంటే విస్పష్టమైన కారణం ఉండాలని, ఇందుకు సంబంధించి 243 (కె) నిబంధన నిర్దేశిస్తోందని చెబుతున్నారు. అంతేకాదు ఎస్ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని అంటున్నారు.