Jagapathi Babu Accepted Affair with Soundarya:
సినిమా తారల మధ్య ఎఫైర్స్ గురించి రకరకాల వార్తలు వస్తాయి. అందులో కొన్ని నిజాలున్నా, చాలావరకూ పుకార్లుగా మిగిలిపోతాయి. కొన్ని నిజాలు చాలాకాలం తర్వాత వెలుగుచూస్తాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఉదంతమే బయటకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే, .. 90 దశకంలో రంభ, రమ్యకృష్ణ, రోజా వంటివారు గ్లామర్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న సమయంలోనే దివంగత నటి సౌందర్య తన మార్కు నటనతో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది.
గ్లామర్ కి దూరంగానే ఉంటూ తన నటనతో అబ్బురపరిచిన సొందర్య దక్షిణాది అగ్ర కథానాయకులందరితోనూ నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే అప్పట్లో జగపతిబాబు, సౌందర్యలది హిట్ పెయిర్‌గా చెప్పుకునేవారు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగినట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఇక కెరీర్ మంచి పీక్ లో ఉండగా ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
కాగా అప్పట్లో వచ్చిన అఫైర్ గురించి జగ్గు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘‘అవును నిజమే! నాకు, సౌందర్యకు ఎఫైర్ ఉంది. నా దృష్టిలో ఎఫైర్ అంటే మంచి సంబంధం అని అర్థం. నాకు సౌందర్య సోదరుడితో మంచి అనుబంధం ఉంది. దీంతో నేను సౌందర్య ఇంటికి, సౌందర్య మా ఇంటికి తరుచూ వస్తూ పోతుండేవాళ్లం. దీంతో జనాలు మామధ్య లైంగిక సంబంధం ఉన్నట్లు బావించారు’’ అని క్లారిటీ గా చెప్పేసాడు.