Monday, May 10, 2021

Latest Posts

మేకప్ మాన్ గా మారిన జగపతి బాబు

Jagapathi Babu Turns Makeup Man
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభనతో ప్రతీ ఒక్కరిలో వణుకు పుడుతుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేకమంది స్టార్స్‌ దీని బారిన పడ్డారు. దీంతో పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ లొకేషన్లలో పాల్గొంటున్నారు సినీ తారలు.

కోవడ్‌ వ్యాప్తి దృష్ట్యా చాలా వరకు అసిస్టెంట్‌ల సహాయం తీసుకోకుండా తమ పనులు తామే చూసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ షూటింగ్‌ లొకేషన్‌లో జగపతి బాబు మేకప్‌మెన్‌గా మారిపోయాడు. తనకి తానే మేకప్ వేసుకుంటూ దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ థ్యాంక్యూ కోవిడ్‌..నీ వల్ల మేకప్ ‌మెన్‌ని అయ్యానంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. ప్రస్తుతం జగపతి బాబు పలు సినిమాల్లో విలన్ మరియు  సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss