Tuesday, April 13, 2021

Latest Posts

కాంగ్రెస్ తీరుపై కత్తులు నూరుతున్న సీనియర్ నేత  

ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అధికార ఆమ్ ఆద్మీ 62సీట్లు గెలుచుకుని ముచ్చటగా మూడోసారి అధికారం సొంతం చేసుకుంది. బిజెపి మూడు సీట్ల నుంచి 8కి చేరింది. ఓట్ల శాతం కూడా పెంచుకుంది. అయితే కాంగ్రెస్ దారుణమైన పరాజయం మూటగట్టుకుంది. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎం గా మంచి పాలన చేసారు. అయితే ఆమ్ ఆద్మీ రాకతో కాంగ్రెస్ కి గండిపడింది. ఇప్పుడు ఒక్కసీటు కూడా రాకుండా పోయింది.

అయితే కాంగ్రెస్ ఓటమిపై సొంత పార్టీలోనే కత్తులు నూరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జయ్‌రాం రమేశ్ స్పందిస్తూ,  మైనారిటీ మతోన్మాదం పట్ల కాంగ్రెస్ మెతకవైఖరి అవలంబిస్తోందన్న ఆరోపణల పట్ల  ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రకమైన మతోన్మాదమైనా దేశానికి ప్రమాదకరమని, వాటి విషయంలోనైనా కాంగ్రెస్ ఒకటే పద్ధతి అవలంబించాలని సూచించారు. పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, జామాత్ ఏ ఇస్లామీ తరహా మతోన్మాదం పట్ల కాంగ్రెస్ కఠినంగా వ్యవహరించాలని ఆయన కుండబద్దలు కొట్టారు.

సీఏఏ నిరసన నేపథ్యంలో ఢిల్లీ ఓట్లలో చీలిక బీజేపీ చీలిక తెచ్చిందని జయ్‌రాం రమేశ్ స్పష్టం చేసారు.  తాజా ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయినప్పటికీ ఫలితాలు కాంగ్రెస్‌కు కూడా చేదు వార్త అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మతోన్మాదం ఏ తరహాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దాన్ని ప్రోత్సహించకూడదు. నిజమైన సెక్యులరిజం అంటే అదే’ అని కామెంట్ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss