చెప్పిన టైమ్ కి అవతార్ 2 ని రిలీస్ చెయ్యబోతున్నట్టు జేమ్స్ కేమరూన్ తెలియచేసారు. “అవతార్” 2009 లో రిలీస్ అయిన ఈ సినిమా ప్రపంచమంతా సంచలనం సృష్టించింది. జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టికి ప్రపంచ సినిమా ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. అప్పుడెప్పుడో టైటానిక్ సినిమాతో అందరినీ అలరించిన ఈయన ఇప్పుడు అవతార్ 2 సినిమా పనుల్లో బిజీ గా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ “మేము అవతార్ 2 కోసం చాలా ప్లాన్స్ వేసుకున్నామని, కానీ అవన్నీ ఈ కరోనా విధ్వంసం వల్ల చెల్లాచెదురయ్యాయని, కానీ మేము అనుకున్న సమయానికి అవతార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది” అని తెలియచేసారు. ఈ సినిమా రిలీస్ డేట్ ను 2021 డిసెంబర్ 21 ఇంతక ముందే ఫిక్స్ చెయ్యడం జరిగింది.
నిన్న అధికారిక అవతార్ ట్విట్టర్ ఖాతాలో అవతార్ 2 సెట్లలో తీసిన చిత్రంలో అవతార్ 2 నటులు కేట్ విన్స్లెట్, జో సల్దానా, సామ్ వర్తింగ్టన్ మరియు క్లిఫ్ కర్టిస్ యొక్క తెరవెనుక ఫోటోను పోస్ట్ చేసింది.
From the set of the sequels: @ZoeSaldana, Sam Worthington, Kate Winslet, and Cliff Curtis taking a break from underwater performance capture for a quick photo!
Fun fact: Much of the performance capture took place in this 900,000 gallon tank, built specifically for the sequels. pic.twitter.com/NSfqoZ6jXJ
— Avatar (@officialavatar) May 13, 2020
James Cameron Says ‘Avatar 2’ Will Release On Time
ఇది కూడా చదవండి: రికార్డులతో అదరగొడుతున్న ఎన్టిఆర్