వై ఎస్ జగన్ ఎన్నో అష్టకష్టాలు పడి పదేళ్ళు పోరాటం చేసి ఏపీ సిఎం పదవిని అందుకున్నారు. అయితే జగన్ అయిదేళ్ళ పాటు సిఎం కుర్చీలో ఉంటారా అంటే(2024 ఏప్రిల్ వరకూ) చెప్పలేం అన్న మాట ఇపుడు వినవస్తోంది. దీనికి కారణం ఏమిటి అంటే జమిలి ఎన్నికల కోసం కేంద్రం చాలా చురుకుగా ఆలోచించడమే. కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల వెంట పరుగులు పెడుతోంది. షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా ఇబ్బందులు వస్తాయని బిజేపి మేధావులు మధనం చేసి తేల్చారట. ఆనాటికి కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ కూడా బలంగా తయారవుతాయని, కేంద్రానికి గట్టి సవాల్ విసురుతాయని కూడా అంచనా వేస్తున్నారుట.
దీనితో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందని అంటున్నారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఇపుడు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే పరిశీలిస్తోంది అంటున్నారు. ఇప్పటికైతే మోడీ మీద మోజు ప్రజలకు బాగానే ఉంది. అందువల్ల 2022 లో జమిలి ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా ఫుల్ మెజారిటీ రాకపోయినా 200 పై బడి సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా సొంత సర్వేలు చెబుతున్నాయట.
దీనితో బిజేపి పెద్దలు జమిలీ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. అయితే ఈ జమిలి ఎన్నికలు జరిగితే ముందుగా దొరికిపోయేది ఏపీ సిఎం జగనే. ఎందుకంటే ఆయనకు అప్పటికి మూడేళ్ళ పాలన మాత్రమే పూర్తి అవుతుంది. ఇంకా బంగారు లాంటి రెండేళ్ల కాలం మిగిలిపోతుంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ అయిదేళ్ళ పాటు సీఎం కుర్చీలో కొలువు ఉండకపోవడం అంటే అది వైసీపీ శ్రేణులకు కూడా నిరాశే. కానీ కేంద్రంలొని బీజేపీ పట్టుబట్టి మరీ జమిలి ఎన్నికలను తెచ్చేలా సీన్ ఉంది. దాంతో జగన్ పవర్ ని కూడా కత్తిరించేలా ఉందని అంటున్నారు రాజీకీయ నిపుణులు.
ఇవి కూడా చదవండి: