Sunday, May 9, 2021

Latest Posts

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు కరోనా నెగిటివ్

Janasena Chief Pawan Kalyan Tests Negative

జనసేన చీఫ్, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా బారినపడ్డారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రార్ధనలు చేశారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు కోవిడ్ నెగిటివ్‌గా నిర్దారణ అయిందని సమాచారం.

హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. పవన్‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉన్నప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఆయన త్వరగానే కోలుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు జనసేన వర్గాలు గాని, ఆసుపత్రి వైద్యులు గాని అధికారికంగా వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss