లాక్ డౌన్ కాలంలో కూడా ఆశీలను వసూలు చేస్తున్న ఆశీల పాట దారుడిని జనసేన లీలకృష్ణ అడ్డుకుని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన మునిసిపల్ కమిషినర్ త్రిపర్ణ రాం కుమార్ ఆశీల పాట దారులకు రూ. 10,000 జరిమానా విదించారు. దాంతో మండపేట మునిసిపల్ కమిషనర్ త్రిపర్ణ రాం కుమార్ గారికి జనసేన కార్యకర్తలు మరియు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మండపేటలో ఈ దోపిడీ ఎప్పుడు నుంచో జరుగుతుంది దీన్ని అపాలనే జనసేన ప్రయత్నం అని కమిషనర్ గారి సహకారంతో నేడు దానికి అడ్డుకట్ట వేశామని తెలిపారు. ఈ సందర్భంగా లీలకృష్ణ గారు మాట్లాడుతూ గోదావరి పరివాహక లంక గ్రామాల్లో కూరగాయలు పండించిన రైతు ప్రస్తుత కరోనా ప్రభావం తో దిక్కు తోచని స్థితి లో ఉన్నడాన్నారు. ఈ క్రమంలో పండిన కూరగాయలు ఎంతో కొంతకు అమ్ము కొందమని మండపేట కు సైకిల్, మోటర్ సైకిల్ పై తెస్తుంటే ఇక్కడ మార్కెట్ పాట ఇజరదారులు, వారి గుమస్తాలు దౌర్జన్యం చేయడం తగదని పేర్కొన్నారు.
ఈ ఘటన పై కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎస్. వి.ఎస్.ఆర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ మార్కెట్ లో రైతులు సైకిళ్ళు, మోటర్ సైకిళ్ళు పై ఎన్ని బుట్టలు తెచ్చిన వారికి ఆశీల నుండి మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆశీల పాటదారులకు 10,000రూ జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. అలాగే పలు చోట్ల మార్కెట్ ఫీజు వసూళ్లు రేట్లు ప్లేక్సీ లు ఏర్పాటు చేసున్నామని తెలిపారు. దాని ప్రకారం మార్కెట్ వ్యాపారులు ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేసారు. అలాగే మండపేట పట్టణం లో సైకిళ్ళు, మోటర్ సైకిళ్ళు పై తిరిగి వ్యాపారం చేసుకునే వారు, స్టాండ్ వేసి అమ్ముకునే వారు రూ 10 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అదే బుట్టలు నేల పై పేర్చి అమ్మితే బుట్ట చొప్పున ఆసీలు చెల్లించాలని కోరారు. లారీల కు రూ వంద ఆశీల విషయం కొన్ని వివరాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని, ఏదైనా ఇబ్బంది వస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఆర్.ఐ వంక ప్రభాకర్ చౌదరి, జనసేన,బీజేపీ నాయకులు,రైతులు, పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కే.జీ.ఎఫ్ లో విషాదం