Janasena Party Got 18 Percent Votes
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపి మొదటి దశ పంచాయితి ఎన్నికల తరువాత ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమిటంటే మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఒచ్చాయని అన్నారు. ఇక తొలిదశ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు.
తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డుల్లో గెలిచారని అలానే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచమని పవన్ తెలిపారు. అయితే ఇది తమకు కూడా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతే కాకుండా తమ మద్దతుతో పోటీచేసిన వారు గెలవటం, రెండోస్ధానంలో నిలవటమంటే జనాల్లో మార్పు మొదలైందనేందుకు నిదర్శనమని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పకనే చెప్పారు.
అయితే పవన్ చేసిన ప్రకటనలో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలీదు. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రపక్షం బీజేపీ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. పోటీచేసిందేమో రెండుపార్టీలు కలిసే పోటీ చేశాయి. కానీ చెప్పిన లెక్కలు మాత్రం తమ పార్టీకి సంబంధించి మాత్రమే. మరి బీజేపీ ఖాతాలో పడిన వార్డులు, పంచాయితీల లెక్కలు ఎందుకు చెప్పలేదనేది జనసేన అధినేతకే తెలియాలి.
ఇవి కూడా చదవండి: