Jasti Krishna Kishore promoted to Principal Commissioner of Income Tax Officer (CBDT).
టీడీపీ సర్కారు హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన సివిల్ సర్వీసెస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌పై ఈడీబీలో పలు అవకతవకలు జరిగాయంటూ జగన్ సర్కార్ ఆయనపై వేటు వేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తర్వాత క్యాట్‌ను ఆశ్రయించిన ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా పని చేస్తున్న కృష్ణ కిశోర్‌కు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ అధికారిగా ప్రమోషన్ ఇస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 ఢిల్లీ హెడ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.