Home బిజినెస్ అమరరాజా నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్

అమరరాజా నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్

99telugu, Amara Raja Batteries Ltd, Amara Raja Group chairman calls it a day, Galla Jayadev, Jayadev Galla takes over as Amara Raja group chairman, Jayadev Galla to become Chairman of Amara Raja Batteries, Ramachandra Galla steps down as Amara Raja Chairman

Jayadev Galla takes over as Amara Raja group chairman

అమరరాజా సంస్థల నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్‌ బాద్యతలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ గల్లా రామచంద్ర ప్రకటించారు. తిరుపతి-కరకంబాడి రోడ్డులోని అమరరాజా కంపెనీ ఆవరణంలో శుక్రవారం సాయంత్రం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు వయోభారం వల్ల అమరరాజా సంస్థల నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్‌ ను ప్రకటిస్తునట్లు తెలిపారు. అలాగే గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.

తాము పెట్టిన ప్లాంట్లన్నీ పల్లె ప్రాంతాల్లో సాగుకు యోగ్యం కాని భూమిలోనే ఏర్పాటుచేశామని, వాటి మిద ఇప్పటివరకు ఆరువేల కోట్ల పెట్టుబడులతో ఎనిమిదివేల మందికి ఉపాధి కల్పించినట్లు తెలియజేసారు. తమ పరిశ్రమ చెన్నరుకి తరలిపోతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని  ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శనివారం జరిగే ఎజిఎం మీటింగ్‌లో నూతన చైర్మన్‌ గల్లా జయదేవ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Exit mobile version