Wednesday, April 21, 2021

Latest Posts

బాబు విశాఖ పర్యటనపై జెసి షాకింగ్ కామెంట్స్

JC Diwakar Reddy Shocking Comments on chandrababu visakha tour:   

 ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తరచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా ఆయన నిర్మొహమాటంగా కామెంట్స్ చేసేస్తారు. తాజాగా చంద్రబాబు విశాఖలో పర్యటన సందర్బంగా చోటుచేసుకున్న పరిణామాలపైనా అయన  షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇవి హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే మరికొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసారు.  

     ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు సమీపంలో వైసీపీ మద్దతుదారులు చావగొట్టకుండా వదిలిపెట్టడం ఆయన అదృష్టమని జెసి  వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అక్కన్నపల్లికి చెందిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ వివిధ కేసుల్లో దాదాపు 60 రోజులు జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. జేసీ బుధవారం సాయంత్రం అక్కనపల్లి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.

    ఈ సందర్భంగా జెసి  మీడియాతో  మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయరని జేసీ ప్రకటించారు. పౌరుషానికి పోటీ చేసినా అనర్హత వేటుతోపాటు కొత్త చట్టాల పేరుతో జైలుపాలు కాక తప్పదని ఆయన చెప్పడం హాట్ టాపిక్ అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss