Jd Chakravarthy wrote a letter to Chiranjeevi
పంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయి. అందులో సినీ పరిశ్రమ ఒకటి. థియేటర్లు మూతపడ్డాయి. సినిమాలు షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో ముఖ్యంగా సినీ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఏర్పాటు చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేశ్ వంటి పలువురు కీలక సభ్యులుగా వ్యవహరించారు. దాదాపు రూ.8కోట్ల రూపాయల విరాళాన్ని సేకరించి దాంతో నాణ్యమైన నిత్యావసర వస్తువులను సినీ కార్మికులకు అందిస్తున్నారు.
ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హీరో, దర్శకుడు జేడీ చక్రవర్తి ఓ లేఖ రాసాడు. ‘‘ప్రియమైన చిరంజీవిగారు..నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మీమ్మల్ని ఒక కంప్లీట్ యాక్టర్‌గా ఇష్టపడేవాడిని.. అంతకు మించీ కాదు. నా తరం నటులందరూ మీతో చక్కగా కలిసిపోయేవారు… నేనెప్పుడూ అలా చేయలేదు, చేయాలనుకోలేదు. కరోనాప్రభావంతో ప్రపంచమంతా ఆగిపోయింది. సినిమా పరిశ్రమ ఎప్పుడూ లేనంత కూలబడింది”అని జెడి పేర్కొన్నాడు.
“నిజానికి ప్రస్తుతం సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంత ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యలను మీతో పాటు నేను కూడా ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చేస్తున్న పని మీమ్మల్ని ఒక మెగాస్టార్ అని చెప్పలేం. గొప్ప వ్యక్తిగా అభివర్ణించాలి. సినీ రంగంలోని పలు శాఖలకు చెందిన కార్మికులు నాకు ఫోన్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఆకలి సమస్యలు ఉండవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు. మీరు ఇండస్ట్రీ రుణం తీర్చుకుంటున్నానని అంటున్నారు కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటికీ మీ అభిమానిని, అనుచరుడిని’’ అని లేఖలో జేడీ పేర్కొన్నాడు