Thursday, May 13, 2021

Latest Posts

ఏపీ రాజకీయాల పై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవ‌ల ఇచ్చిన ఓ టీవి ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నఆయన ఏపీ రాజ‌కీయాలు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్ర  ప్ర‌భుత్వం మేనిఫెస్టోను లో చెప్పిన అన్నీ అంశాలు పూర్తి చేస్తున్నారని  చాలా కొందరు మేనిఫెస్టోను కేవలం ఎన్నికల్లో విజయం కోసమే ఉపయోగిస్తారే తప్ప అధికారంలోనికి వచ్చాక వాటిని పక్కన పెట్టేస్తారు అని కానీ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను అమలుకు తగిన చర్యలు చేబడుతున్నారు అని ప్రశంసల జల్లు కురిపించారు.

ఇక, పవన్ కల్యాణ్ వ్యవహారంపై స్పందించిన ఆయన, తాను పూర్తిస్తాయిలో రాజకీయాలు చేయడానికి వచ్చానని పవన్ కల్యాణ్  రాజ‌కీయప‌రంగా పూర్తి పరిప‌క్వ‌త‌ కనిపించకపోవడం వల్లే జనసేనకు రాజీనామా చేశానని తెలిపారు. కాగా ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేనని  గత రెండు వారాల్లోనే చాలా మంది తనను అన్ని పార్టీల్లో చేర్చారని ముఖ్యంగా సోషల్ మీడియాలో నన్ను అన్ని పార్టీల్లో చేర్చారని తాను మాత్రం దానిపై  ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే, తనకు ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావడానికి ఎప్పటికప్పుడు నా ప్రయత్నం కొనసాగుతూనే ఉందని తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ.

ఇది కూడా చదవండి: మేమే కరోనా మొదటి శాంపిల్ ను ధ్వంసం చేశాం | చైనా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss