Sunday, May 16, 2021

Latest Posts

జెడి రాజీనామా – జనసేన కౌంటర్

మొన్నటి ఎన్నికల ముందు జనసేనలో చేరి,పవన్ కళ్యాణ్ అశీసులతో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీచేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలో అంటీ అంటనట్లు ఉంటున్నారు. దీంతో ఆయన తాజాగా జనసేనకు రాజీనామా చేసారు. అయితే ఈ రాజీనామాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, జనసేన పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటన విడుదల చేసారు. జెడి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఆయనకు శుభాభినందనలు తెలిపారు. వీవీ లక్ష్మీనారాయణ భావాలను తాము గౌరవిస్తున్నామని అంటూనే కౌంటర్ కూడా ఇచ్చారు.

తన జీవితమంతా రాజకీయాలకేనని సినిమాల్లో నటించనని పవన్ చెప్పారని కానీ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోందని అందుకే రాజీనామా చేస్తున్నానని వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా సమయంలో పేర్కొన్నారు. దీనిపై పవన్ గట్టి కౌంటర్ ఇస్తూ, పార్టీని నడిపేందుకు తన వద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు పవర్ ప్రాజెక్టులు గనులు పాల ఫ్యాక్టరీలు ఏమీ లేవని కనీసం అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని జనసేనాని పేర్కొన్నారు.
తనకు తెలిసినది సినిమా ఒక్కటేనని తన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని వారి కోసం తన కుటుంబం కోసం పార్టీ ఆర్థిక పుష్టి కోసం తనకు సినిమాలు చేయడం తప్పనిసరిగా మారిందని పవన్ స్పష్టం చేశారు.వీటిని కూడా వీవీ లక్ష్మీనారాయణ తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటె బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆయన రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై గౌరవం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మొత్తానికి కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడిపోతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss