టాలీవుడ్ హీరో వరుణ్‌సందేశ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత జీడిగుంట రామచంద్రమూర్తి (80) ఈ రోజు కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడి అయన మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో వరంగల్ సహకార బ్యాంక్‌లో ఉద్యోగం చెయ్యగా, ఆ తర్వాత కొంతకాలం విద్యాశాఖలో పని చేసి అనంతరం 1971లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. తెలుగు కథ, నవల, నాటకం, వ్యాస, ప్రసారమాధ్యమ రచన తదితర ప్రక్రియల్లో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన రేడియో కళాకారుడిగానూ గుర్తింపు పొందారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: