Jhanvi Kapoor Tollywood Entry
బాలీవుడ్లో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే ఓ ఇమేజ్ ఏర్పరచుకుంటుంది శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్. మూడు హిందీ సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది ఆమె. అయితే త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో లీడ్ రోల్లో జాన్వీని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.
దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ లో టాక్. కృష్ణవంశీ సూపర్‌హిట్ చిత్రం ‘అంతఃపురం’ హిందీ రీమేక్ ‘శక్తి: ది పవర్’ని ప్రముఖ నిర్మాత, జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్మించారు. మరి.. కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ గురించి బోనీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. అయితే లాక్ డౌన్ సమయంలోనే ఓ కథను కృష్ణవంశీ సిద్ధం చేసుకున్నారట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని సమాచారం.
అయితే అటు బాలీవుడ్లో గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ వంటి ఫీమేల్ ఓరియంటేడ్ సినిమాల్లో నటించిన జాన్వీకపూర్ అయితే ఈ స్టోరీకి సరిగ్గా సరిపోతుందని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చించారట. అటువైటు నుంచి రావాల్సిన స్పందన కోసం వేచి చూస్తున్నారట. ఈనేపథ్యంలోనే జాన్వీ కపూర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్ కృష్ణవంశీకే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: