Thursday, December 2, 2021

Latest Posts

దరఖాస్తును ఉపసంహరించుకున్న జాన్సన్ అండ్ జాన్సన్

జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ కరోనావైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి కోసం భారత ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) వెల్లడించింది. చట్టపరమైన చిక్కులను తొలగించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  అయితే, వ్యాక్సిన్ అనుమతిపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, వ్యాక్సిన్‌కు సంబంధించి నూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని కొన్ని రోజుల క్రితం జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. కానీ అమెరికాలో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ  వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టొచ్చన్న అనుమానాల కారణంగా అమెరికా ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. దాంతో ఈ సంచలన నిర్ణయం తెసుకొని ఉండవచ్చని అంటున్నారు కొందరు. కాగా, భారత్ లో ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది.

 

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss