Tuesday, January 19, 2021

Latest Posts

ఆర్జీవీ గిల్లేవాడా –  టైటిల్ లోగో విడుదల

Jonnavithula’s biopic on Ram Gopal Varma titled as RGV

ఆమధ్య పుట్టినరోజు వేడుక పురస్కరించుకుని చాగంటి కోటేశ్వరరావు మాటలపై వెటకారంగా మాట్లాడ్డమే కాకుండా సినీ రచయితను సైతం ఎవరో తెలియదన్నట్లు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేసాడు. దీనిపై ఆగ్రహించిన  ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తాను కూడా వర్మ మీద సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆచారాల్లో పెట్టారు.   కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినికార్ప్ సమర్పణలోజొన్నవిత్తుల దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు.

మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్నఈ మూవీకి ‘ఆర్జీవీ‘ పేరుతొ రోజూ గిల్లేవాడు ట్యాగ్ లైన్ తో తెరకెక్కిస్తున్ ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని చెప్పారు.

అందుకే శ్రీరామనవమి పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేశామని జొన్నవిత్తుల తెలిపారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని,  సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని వివరించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss