Sunday, June 20, 2021

Latest Posts

ప్రముఖ జర్నలిస్ట్ టి.ఎన్.ఆర్ కన్నుమూత

Journalist TNR Dies

ప్రముఖ సినిమా జర్నలిస్ట్ టి నరసింహ రెడ్డి అలియాస్ టిఎన్ఆర్, కోవిడ్ -19 కారణంగా ఈ రోజు కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం టిఎన్‌ఆర్‌కు కరోనా వైరస్ సోకి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

రోజులు గడిచే కొద్ది టిఎన్ఆర్ ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది మరియు వారాంతంలో అతని పరిస్థితి చాలా క్రిటికల్ స్టేజ్ కి వెళ్ళి అతను కోమాలోకి వెళ్ళాడు. టి‌ఎన్‌ఆర్ యొక్క ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్న చాలా మంది జర్నలిస్టులు ఆందోళనను వ్యక్తం చేశారు మరియు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ అవేవీ ఆయనని కాపాడలేకపోయాయి. అతను ఈ రోజు ఉదయం అతని తుది శ్వాస విడిచారు.

‘ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్’ యూట్యూబ్ ఇంటర్వ్యూలతో, టిఎన్ఆర్ కి మంచి పాపులారిటీ వచ్చింది. అతను సెలెబ్రిటీలను చేసిన ఇంటర్వ్యూలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి. అయితే చివరికి ఇలా కరోనా వల్ల అతని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తను ఇక లేడని తెలిసిన జర్నలిస్టులు, సెలెబ్రిటీలు తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss