బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి బ్యాక్ ఎవరు లేకుండా పైకి వస్తే అతను జూనియర్ ఎన్టిఆర్ లా ఉంటాడేమో… మొదటి సినిమా ఏంటో చాలా మందికి గుర్తు లేదు అలాగని మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేలా చేసిన తన రెండో సినిమా స్టూడెంట్ నం1 తో తెలుగు ప్రేక్షకుల తెలుగు అభిమానులకు టార్చ్ బేరర్ లా కనిపించాడు. తరువాత ఆది సినిమాతో తెలుగు సూపర్ స్టార్ లలో ఒకరిగా ఎదిగిన తారక్ కేవలం అతి తక్కువ వయసులోనే వయసుకు మించిన హిట్లను చూసేశాడు. దానిలో ఒకటి సింహాద్రి.
కాగా తన రూపాన్ని సైతం మార్చుకుని తెరముందుకు వచ్చి యంగ్ టైగర్ గా చెదరని ముద్ర వేసుకున్నాడు. తన డాన్స్, తన నటన, తన వ్యక్తిత్వం ఇవన్నీ నచ్చి వెంట ఉన్న అభిమానులు తనని యంగ్ టైగర్ ఎన్టిఆర్ అని రోరింగ్ గా పిలుచుకుంటారు. ఇప్పుడు తన రోరింగ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచమంతా చూడబోతుంది. వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యే నటన మనం చాలా సినిమాలతో చూశాం కాబట్టి ఇంత పక్కగా మాట్లాడుకోవాల్సివస్తుంది అలాంటి జూనియర్ బర్త్ డే ఈ రోజు, విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్ డే తారక్.
ఇది కూడా చదవండి : జూనియర్ ఎన్టిఆర్ అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న విశ్వక్సేన్
ఇది కూడా చదవండి : అభిమానులకు జూనియర్ ఎన్టిఆర్ లేఖ