Thursday, February 25, 2021

Latest Posts

తారక్ సరసన జాన్వీ కపూర్

Jr NTR to romance with Janhvi Kapoor in Trivikram movie:

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన తొలిచిత్రం అరవింద సమేత బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ పలికించిన ఘనత త్రివిక్రమ్ కి చెందుతుంది. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో ఈ సినిమా చాటిచెప్పింది. మళ్ళీ ఇలాంటి కాంబో కోసం ఫాన్స్ కూడా ఎదురుచూడడం సహజమే.

అయితే ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీ అయిపోయాడు. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి ‘అల వైకుంఠపురంలో’ సినిమా తో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని నమోదుచేసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తీయాలని భావిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది విడుదల సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల ను పెడుతున్నారట. ఒక హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకుంటున్నారట. ఎందుకంటే అరవింద సమేతలో ఎన్టీఆర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరింది. పూజ మరోసారి జతకడితే త్రివిక్రమ్ తో వరుసగా మూడోసారి అవుతుంది. ఇంకో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నట్లు టాక్. అయితే ఇది నిజామా కదా అనేది తేలాల్సి ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss