Sunday, June 20, 2021

Latest Posts

రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ తన హెల్త్ అప్డేట్ చెప్పిన తారక్

Junior NTR Health Update
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తనకు కరోనా వచ్చింది అని స్వయంగా తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఆయన అభిమానులు ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా తన హెల్త్ కండిషన్‌పై అప్‌డేట్ ఇస్తూ రంజాన్ పండగ శుభాకాంక్షలు చెప్పారు తారక్. ఈ రోజు రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ”ప్రతి ఒక్కరికీ ఈద్ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కోవిడ్ నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నా. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss