Sunday, June 20, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ టిడిపిలో చేరాలంటూ నినాదాలు

Junior NTR Re Entry To TDP Party Demand Raised

2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నప్పటి నుండి, పార్టీలో ఒక డిమాండ్ కొనసాగుతుంది. అదే ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్‌టి రామారావు తిరిగి టి‌డి‌పి లోకి రావాలని వచ్చి పార్టీ పగ్గాలను చేపట్టాలని. టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించినప్పుడల్లా, పార్టీ వైభవాన్ని పునరుద్ధరించడానికి జూనియర్ ఎన్టిఆర్ ను తిరిగి తీసుకురావాలని పార్టీ కార్యకర్తల నుండి డిమాండ్ వచ్చింది.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టిడిపిలో చురుకైన పాత్ర పోషించిన జూనియర్ ఎన్‌టిఆర్ ను పార్టీ నుంచి తప్పించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్‌టిఆర్ కూడా, ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను ఉపయోగించుకున్నాడని గ్రహించి, అతను సైలెంట్ గా తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టాడు.

ఇప్పుడు 2019 ఎన్నికలలో లోకేష్ పరాజయం, చంద్రబాబు కూడా పట్టు కోల్పోతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ ను టిడిపిలో తిరిగి తెర పైకి తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. రాజకీయాలకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుప్పంలోని ములకాలపల్లి గ్రామంలో జెండా పోస్టు, బ్యానర్ ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss