Sunday, June 20, 2021

Latest Posts

జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో స్పెషల్ వేడుక

Junior NTR Son Bhargav Ram

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రణతి దంపతులకు నందమూరి భార్గవ్ రామ్ మరియు అభయ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు నందమూరి భార్గవ్ రామ్ అక్షరభ్యాసం కార్యక్రమం ఆదివారం జరిగింది. జూబ్లీ హిల్స్‌లోని తారక్ నివాసంలో చాలా సైలెంట్ గా జరిగింది.

ఇప్పుడు ఈ అక్షరభ్యాసం ఫంక్షన్ నుండి జూనియర్ ఎన్టీఆర్, భార్గవ్ రామ్ యొక్క చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ 2011 సంవత్సరంలో లక్ష్మీ ప్రణతి ను వివాహం చేసుకున్నారు, మరియు వీరికి భార్గవ్ రామ్ జూన్ 14, 2018న పుట్టాడు.

Junior NTR Son Bhargav Ram, Junior NTR Son Bhargav Ram Photos, Junior NTR Son Bhargav Ram Aksharabhyasam,Junior NTR Bhargav Ram, Bhargav Ram, Bhargav Ram Photos

ఇక సినిమాల పరంగా ఎన్‌టి‌ఆర్ మంచి ఫ్లో లో ఉన్నాడు. ఎన్‌టి‌ఆర్ రాజమౌళి యొక్క ఆర్‌ఆర్‌ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్లో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ మరియు అజయ్ దేవ్‌గన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం 2021 అక్టోబర్ 13 న థియేటర్లలోకి రానుంది. ఇవే కాకుండా ఎన్‌టి‌ఆర్ త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ తో తదుపరి సినిమాలు చేయనున్నాడు తారక్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss