Thursday, April 15, 2021

Latest Posts

భార్య కోసం సూప్ చేసిన కే ఏ పాల్

KA Paul made soup for his wife :

ఇంతకు ముందు మత ప్రభోదకుడిగా ఉన్న కె.ఎ.పాల్ రాజకీయ నాయకుడుగా గత ఎన్నికల సీజన్లో అకస్మాత్తుగా అందరికీ వినోదాన్ని అందించారు. ఆ రోజుల్లో అతను దాదాపు అన్ని టీవీ ఛానెళ్ళలో కనిపించి, అడిగిన వారందరికి ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ హడావిడి చేయడం జరిగింది. పెద్దగా అర్ధం కానప్పటికీ, మీడియా తన ప్రకటనలకు ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిందో  ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మరియు అతను టీవీ ఛానెళ్లలో ఏదైనా స్లాట్లను కొన్నారనే అనుమానాలు అప్పట్లో వచ్చాయి.

కాగా ఇప్పుడు కె.ఎ.పాల్ ప్రపంచానికి కరోనా జాగ్రత్తలు చెపుతూ హుందాగా నడుచుకుంటున్నారు. తాజాగా  ప్రస్తుత పరిస్తితిని చక్కగా చెబుతూ ఉన్న వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా తన భార్య కోసం వెజిటేబుల్ సూప్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు తన భార్యకు వెజిటేబుల్ సూప్ అంటే ఇష్టమని, అందుకే  చేస్తున్నానని,  తన భార్య వద్ద నేర్చుకోకుండా తానే స్వయంగా చేశానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరెల్ గా మారింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss