Monday, March 8, 2021

Latest Posts

మళ్ళీ విరుచుకుపడ్డ కె ఏ పాల్

KA PAUL sensational comments

ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న కే‌ఏ పాల్, ఇండియా లో ఎలెక్షన్ అయినవెంటనే అమెరికా కు తరలిపోయారు. హాస్యాస్పదమైన వ్యాఖ్యలతో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించే కే‌ఏ పాల్ ప్రస్తుతం అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతక ముందు ఉన్న హాస్యం లేకపోయినా, కొంత బాధ్యతాయుత వ్యాఖ్యలకు పరిమితమవ్వడం గమనించవలసిన విషయం.

కాగా కే‌ఏ పాల్ మాట్లాడుతూ,  హ్యూస్టన్ లో ఉన్న నేను ఇప్పుడే ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ విన్నానని, అది రెండు తెలుగు రాష్ట్రాలో లిక్కర్ షాపులు ఓపెన్ చేశారని, కానీ అక్కడ జనం మాత్రం ఒకరిని ఒకరు తాకుతూ కిలో మీటర్ల మేర లైన్ లో నిలబడుతున్నారని, ఇక్కడ అమెరికాలో ఈ రోజు మళ్ళీ 30 వేల కరోనా పాజిటివ్ కేసులు సీరియస్ గా ఉన్నాయని, ప్రపంచం అంతా ఇదే పరిస్తితి ఉండగా మన తెలుగు రాష్ట్రాలు మాత్రం మద్య పానాన్ని నిషేదిస్తామని ఎలెక్షన్ లో ఊదరగొట్టి ప్రస్తుతం ఇలాంటి పరిస్తితులలో ఇటువంటి చర్యలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీద విరుచుకుపడ్డారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss