Monday, May 10, 2021

Latest Posts

కరోనా సమయంలో కాజల్ అగర్వాల్ ఏం చేస్తుందంటే?

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీనితో ప్రజలు భయ బ్రాంతులకు గురవ్వుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సామాన్యులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే దానికి సరైన సొల్యూషన్ ప్రజలంతా నియమనిబంధనలు పాటిస్తూ తమ పనుల్లో ఉండాలని ఇంట్లోనుంచి బయటకు వెళ్లకుండా చిన్నా చితకా పనులు చేస్తూ గడపాలని కాజల్ అగర్వాల్ సూచిస్తున్నారు.

ఈ భయంకరమైన పరిస్థితిలో కాజల్ అగర్వాల్ కూడా తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తీరిక సమయాన్ని అల్లికలు కుట్లతో స్పెండ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఈ నిస్సహాయ స్థితిలో మానసిక ఒత్తిడిని జయించవచ్చని బ్యూటీ క్వీన్ చెబుతుంది. కాజల్ అగర్వాల్ ఒక  సూది తీసుకుని నూలు రోల్ తో అల్లికలను ప్రయత్నిస్తన్నారు. సూది- రోల్ ఫోటోను సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.

పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మన చుట్టూ నిస్సహాయత  ఆందోళన కనిపిస్తోంది. మన మనస్సులను ఏదో ఒక పనిపై కేంద్రీకరించడం చాలా ముఖ్యం. అది ఏదైనా కావచ్చు- ఆలోచన ఉద్దేశపూర్వకంగా లేదా సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో అవసరం. గెలుస్తాం అనే భావాన్ని ఏర్పరచాలి. నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మానసిక క్షేమానికి సహాయపడుతుంది! ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం నిజంగా చికిత్సా విధానం! మీ ఖాళీ సమయంలో ఇంట్లో ఉండి మీరు ఏమి చేస్తున్నారు? అంటూ ఆ ఫోటోలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss