Kajal Aggarwal Help Fan
పెళ్లయ్యాక కూడా జోరు తగ్గకుండా సినిమాలు చేస్తోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో ఆడిపాడుతున్న ఈ భామ తాజాగా ఓ యువతికి ఆర్థిక సాయం చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు లేక బాధపడుతున్న విద్యార్థినిని ఆర్థిక సాయం చేసింది ఈ భామ. ఈమేరకు ఆమె గూగుల్ పేలో డబ్బులు పంపించిన స్క్రీన్షాట్లతో పాటు సదరు విద్యార్థిని ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు కాజల్ ఫ్యాన్స్.
నెట్టింట వైరల్ అవుతున్న దాని ప్రకారం హైదరాబాద్‌లో ఎం.ఫార్మసీ చదువుతున్న సుమ అనే విద్యార్థి ఉద్యోగం చేసుకుంటూ తన కాలేజీ ఫీజు కట్టుకుంటూ వస్తుంది. అయితే ఈ మధ్యే ఆమె ఉద్యోగం పోవడంతో కళాశాల ఫీజు కట్టేందుకు ఆమె తెగ ఇబ్బంది పడుతోంది. రూ. 82 వేల ఫీజు కడితే కానీ పరీక్షలు రాయనివ్వరు, దీంతో నా చదువు మధ్యలోనే ఆగిపోవాల్సిందేనా? అని తనకు సాయం అందించమంటూ అభిమాన హీరోయిన్ కాజల్‌ను కోరింది. దీంతో విద్యార్థిని వివరాలు సేకరించిన కాజల్ ఆమెకు లక్ష రూపాయల సహాయం చేసిందట. కాజల్ తన అభిమానికి చేసిన సాయానికి ఆమెను ఆకాశానికెత్తుతున్నారు ఫ్యాన్స్. కాజల్ మనసు రియల్ లైఫ్ లో కూడా చందమామ లాంటి మనసు అని ఆమె చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: