Sunday, June 20, 2021

Latest Posts

భారీగా రెమ్యూనరేషన్ తగ్గించుకున్న కాజల్

Kajal Aggarwal Remuneration Decreased

ఇటీవల వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తగ్గిస్తుందట. ఇంతక మునుపులా కాకుండా టాలీవుడ్లో కూడా వివాహం అయిన హీరోయిన్లు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక నటి యొక్క వైవాహిక స్థితి గురించి చిత్రనిర్మాతలు మరియు ప్రేక్షకులు ఆందోళన చెందడం లేదని సమంతా మరియు కాజల్ రుజువు చేస్తున్నారు.

అయితే, సీనియర్ నటీమణులకు ఇప్పుడు డిమాండ్ పూర్తిగా తగ్గిపోలేదు. సీనియర్ స్టార్స్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున సరసన ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను పొందడానికి, పారితోషకమ్ బాగా తగ్గించిందని టాక్. ఆమె ఇప్పుడు తన రెమ్యూనరేషన్ సగానికి తగ్గించుకుందట. దీనితో నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఈ నటి ఆచార్య సినిమాలో నటిస్తుంది. అంతే కాకుండా ప్రవీణ సత్తారు – నాగార్జున చిత్రం షూట్ లో కూడా ఆమె చేయనుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss