Kajal aggarwal respond rumours of acharya movie
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా ఆచార్య నుండి కాజల్ కూడా తప్పుకుందని వస్తున్న వార్తల్లో నిజం లేదంటుంది కాజల్. ఈ సినిమా లో తన పాత్రకి పెద్దగా ప్రదాన్యత ఇవ్వకపోవటం తో సినిమా నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఓ తమిళ చిత్రం కోసం కాజల్ ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియాలో పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టడానికి కాజల్ టీం రంగంలోకి దిగింది.
కాజల్ వ్యక్తిగత మేనేజర్ ఆచార్య మూవీ నుండి ఆమె తప్పుకుంది అని వస్తున్న వార్తలలో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆమె ఆచార్య మూవీ కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నారని, లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటారని చెప్పటం జరిగింది. ముందుగా ఆచార్య సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె తప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. దీనితో ఆచార్య సినిమాలో హీరోయిన్ పాత్రకు అసలు ప్రాధాన్యం ఉండదని అందుకే కాజల్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నారనే పుకారు పుట్టుకొచ్చింది.
ఇక ఈ మూవీలో రామ్ చరణ్ తో పాటు నాగబాబు కూతురు నిహారిక కూడా ఓ రోల్ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇక చరణ్ చిరు కలిసి నటిస్తున్న పూరిస్తాయి మొదటి మల్టీస్టారర్ సినిమా ఆచార్య కావడం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.