Wednesday, January 19, 2022

Latest Posts

కళ్యాణ్ రామ్ డెవిల్ మోషన్ టీజర్ అదిరింది

Kalyan Ram Devil Teaser

నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క 21వ చిత్రం డెవిల్ ని ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్‌లైన్‌తో సిద్ధం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ వీడియో ని విడుదల చేశారు. ఈ సినిమాని నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు.

పోస్టర్‌లోని బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్నాడు మరియు 1945 లో స్వాతంత్ర్యానికి పూర్వం ఈ కథ సాగనుంది. కళ్యాణ్ రామ్ రైలు నుండి బయటికి వచ్చేటప్పుడు చేతిలో తుపాకీ పట్టుకొని ఉన్నట్లు చూడవచ్చు, పంచెకట్టులో అతను పొడవాటి జుట్టు మరియు మీసంతో మందపాటి గడ్డంతో విలక్షణంగా కనిపిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్ ఆధ్వర్యంలో అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ రాశారు. డెవిల్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ మరియు కన్నడ భాషలలో అగ్రశ్రేణి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss