Sunday, June 20, 2021

Latest Posts

పవన్ కల్యాణ్ ను అనుసరిస్తున్న కమల్ హాసన్

Kamal Haasan Following Pawan Kalyan
సౌత్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్, కమల్ హాసన్ మధ్య చాలా పోలికలున్నాయి. సినిమాలు విడిచిపెట్టడం, రాజకీయ పార్టీని స్థాపించడం. ఆ తరువాత అనూహ్య పరాజయం. ఇప్పుడు పవన్ ఏమి చేస్తున్నారో కమల్ హాసన్ కూడా అదే చేస్తున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సినిమాలు చెయ్యటం మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే ప్రణాళికను ఫాలో అవుతున్నాడు. ఇలా ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే అలా తన సినిమాలపై దృష్టిపెట్టారు కమల్. ఆగిపోయిన ఇండియన్-2 సినిమాను మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత-దర్శకుడు మధ్య జరుగుతున్న గొడవల్ని పరిష్కరించే దిశగా కమల్ అడుగులు వేస్తున్నారు.

ఇండియన్-2 సినిమాను పక్కనపెట్టి దర్శకుడు శంకర్.. రామ్ చరణ్, రణవీర్ సింగ్ తో సినిమాలు చేయనున్నట్టు తెలిపాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వివాదం ముదిరి కోర్టు మెట్లు ఎక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు స్వయంగా తానే ఈ వ్యవహారాన్ని పరిష్కరించే పనిలో పడ్డారు కమల్.

అంతే కాదు ఈ సినిమాతో పాటు చాన్నాళ్లుగా ఆగిపోయిన శభాష్ నాయుడు సినిమాను కూడా కంప్లీట్ చేయాలని కమల్ నిర్ణయించారు. ఈ సినిమాను తనే రాసి, సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు కమల్ హాసన్. సో మళ్ళీ పవన్ మాదిరిగానే వరుస పెట్టి సినిమాలు చేసే అవకాశం కనిపిస్తుంది కమల్ హాసన్ కూడా.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss