Home రాజకీయం నిన్న వచ్చిన ఎలక్షన్ల రిజల్ట్స్లో కమల్ హాసన్ కి చుక్కెదురు

నిన్న వచ్చిన ఎలక్షన్ల రిజల్ట్స్లో కమల్ హాసన్ కి చుక్కెదురు

Kamal Haasan Lost In Elections, Kamal Loses To BJP Vanathi Srinivasan, Kamal Lost In Elections, Kamal Loses To BJP In Elections, 99telugu, bjp candidate srinivasan trailing, kamal haasan leading, south coiambatore, Tamilnadu Elections

Kamal Haasan Lost In Elections
హీరో,మక్కల్ నీతి మైయం అధ్యక్షుడు కమల్ హాసన్ నిన్న ఎలెక్షన్స్ లో ఓడిపోయారు. బిజెపి అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు కమల్ హాసన్. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కి వనతి శ్రీనివాసన్ నుంచి గట్టి పోటి ఎదురయ్యింది. అయితే చివరికి, వనతి శ్రీనివాసన్ 1728 ఓట్ల తేడాతో గెలుపొందారు.

వనతి 53,209 ఓట్లు సాధించగా, కమల్‌కు 51,481 ఓట్లు వచ్చాయి. డిఎంకె మద్దతుతో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు మయూర జయకుమార్‌కు 41,426 ఓట్లు వచ్చాయి. అయితే కమల్ హాసన్ ఎన్నికలలో పాల్గొనడం ఇదే మొదటిసారి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 42 మంది అభ్యర్థులను ఎంఎన్ఎం పార్టీ నిలబెట్టింది. పార్టీ అఖిల భారత సమవత మక్కల్ కచ్చితో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ, కమల్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. దీంతో కమల్ తన రాజకీయ అరంగేట్రం సంగ్దిద్దంలో పడింది.

ఇవి కూడా చదవండి:

 

Exit mobile version