Thursday, May 13, 2021

Latest Posts

కమల్ హాసన్ నిర్ణయంపై పార్టీ శ్రేణుల షాక్ ……..

సినిమా వేరు ,రాజకీయాలు వేరు. సినిమా వాళ్ళు అందరూ రాజకీయాల్లో సక్సెస్ కాలేరని పలు సంఘటనలు రుజువుచేశాయ. తమిళనాట విలక్షణ నటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టారు. కానీ ఆయన అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే, పార్టీ పటిష్టతపై చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన నిర్ణయం చూస్తే, మరిన్ని విమర్శలకు నెలవుగా మారింది.  మక్కల్ నీది మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) పార్టీ పెట్టిన  కమల్‌హాసన్  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ చేయబోదని ప్రకటించారు.

మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ పోటీ చేయని కమల్ హాసన్ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎమ్ఎన్ఎమ్ పోటీ చేయబోదని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓపక్క  తమతో చేతులు కలపాలంటూ కమల్‌ ఇచ్చిన పిలుపునకు రజినీకాంత్ సానుకూలంగా స్పందించడంతో తమిళ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమౌతుందని అనుకున్నారు. కానీ  రజినీ కొత్త పార్టీ ప్రకటిస్తారా లేక కమల్ పార్టీతోటే ఉంటారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక డీఎంకే అధినేత స్టాలిన్‌తో కమల్‌ సన్నిహితంగా ఉంటుండగా, రజినీకాంత్ బీజేపీ‌ అధినాయకత్వానికి దగ్గరగా ఉంటున్నారు. అన్నాడీఎంకే కూడా కమలం పార్టీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి చెక్ పెట్టేందుకు కమలనాథులు అన్నాడీఎంకేతో పాటు రజినీ సహకారం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ కమల్ కి ఎలాంటి ఇమేజ్ లేకుండా పోతుందని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss