Sunday, June 20, 2021

Latest Posts

వార్నింగ్ ఇస్తున్న కమల్ హాసన్

Kamal Haasan Warns Party Members
తమిళ స్టార్ హీరో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. తన పార్టీ ఎక్కడ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంతే కాకుండా తాను పోటీచేసిన చోట కూడా గెలవలేకపోయారు కమల్.

దీనితో పార్టీ పరిస్థితిని చక్క దిద్దాలని పట్టం కట్టుకున్నారు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్. అందుకోసం పార్టీలోని కలుపు మొక్కలను ఏరి వేస్తానని తప్పు చేసే వారిని పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను ఖచ్చితంగా శిక్షిస్తానని తెలిపారు.

పేద ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పార్టీ ఇదని ఎవరైనా తప్పు చేస్తే విడిచి పెట్టనని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కలుషితమైన రాజకీయాన్ని త్వరలోనే భూస్తాపితం చేస్తామని, ప్రజల సంక్షేమం కోసం ఎంతవరకైనా వెళ్తానని, పార్టీలో యువకులకు మహిళలకు పెద్ద పీట వేస్తాం అని కమల్ హాసన్ తెలిపారు.

మరో రెండు వేల మంది ఓటు వేసి ఉంటే నేను తమిళనాడు అసెంబ్లీలో చరిత్ర సృష్టించేవాడిని, విజయం అనేది అంత సులువు కాదని, నిరంతరం సాధన, కృషి వల్లే సాధ్యం అవుతుందని కమల్ అన్నారు. ఇక పై పార్టీ బలోపేతానికి పూర్తి కృషి చేస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss